Damaged roads in AP: అడుగుకో గుంత.. అధ్వానంగా గన్నవరం-మానికొండ రహదారి - ఏపీలో రోడ్ల పరిస్థితి
🎬 Watch Now: Feature Video
Damaged roads in AP: కృష్ణా జిల్లాలోని గన్నవరం-మానికొండ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. గన్నవరం మండలం బూతిమిల్లిపాడు నుంచి మానికొండ వరకు అడుగుకో గుంత దర్శనం ఇవ్వటం గమనార్హం. ప్రధానంగా తరిగొప్పల వద్ద ఏర్పడిన భారీ గుంతలతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికి కూడా రహదారి చెరువును తలపించడంతో స్థానికులు, రైతుల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు అరగంట పట్టే ప్రయాణం కాస్తా గుంతల కారణంగా గంటన్నర పడుతుందని ప్రజలు వాపోతున్నారు. దీంతో నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం, గుడివాడ, పెనమలూరు ప్రాంతాలకు రాకపోకలు సాగించే స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అధ్వానంగా తయారైన రహదారిలో వెళ్లలేక నానా తంటాలు పడుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా నూతన రహదారి నిర్మిస్తామంటూ అధికారులు.. కాలయాపన చేయడం తప్ప కార్యాచరణ రూపొందించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా త్వరగా అధికారులు స్పందించి నూతన రహదారిని నిర్మించాలని పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.