ఎస్పీ కార్యాలయం వద్ద దళితుల ఆందోళన - 'వైసీపీ అనుచరుల నుంచి పొంచి ఉన్న ముప్పు' - guntur political news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 4:32 PM IST
Dalits Protest in Front of SP Office : గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వట్టిచెరుకూరు మండలం గారపాడులో శనివారం రాత్రి దళితులపై దాడిని నిరసిస్తూ బాధితులు, నేతలు ఆందోళనకు దిగారు. వైసీపీ నేత మన్నవ వీరనారాయణ నుంచి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మన్నవ వీరనారాయణ అనుచరులు అర్ధరాత్రి ఇంటి మీదకు వచ్చి తన భర్త వీరయ్యతో పాటు తనపై దాడి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
Dalit Demand for Justice : వైసీపీ నేత మన్నవ వీరనారాయణ నుంచి దళితులకు ప్రాణ హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు అధికారులను కోరుకున్నారు. దాడి చేసిన వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని దళిత నేత ఏసుపాదం డిమాండ్ చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దళిత నేతలు హెచ్చరించారు.