Customs Officers Seized Smuggled Gold: 6 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు - 6 crores worth of gold seized by customs officers

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 9:12 AM IST

Customs Officers Seized Smuggled Gold: విజయవాడ కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. ఓ కారులో రూ. 6 కోట్ల 40 లక్షల విలువైన 11 కిలోల 100 గ్రాముల బంగారం, లక్షన్నర విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం కలకలం సృష్టించింది. శ్రీలంక, దుబాయ్‌ల నుంచి తెచ్చి.. చెన్నై మీదుగా విజయవాడకు పసిడిని స్మగ్లింగ్‌ చేస్తున్నారన్న సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వస్తున్న కారులో తరలిస్తున్న 4.3 కిలోల బంగారంతో పాటు 6.8 కిలోల బంగారు ఆభరణాలను, లక్షన్నర విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నారు. అది విదేశీ బంగారమని తేల్చిన కస్టమ్స్‌ అధికారులు.. దాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. కస్టమ్స్ చట్టం 1962లోని నిబంధనల ప్రకారం బంగారం తరలిస్తున్న వ్యక్తిని విశాఖలోని ఆర్థిక నేరాలను విచారించే ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. 13 రోజుల రిమాండ్ విధించారు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.