Currency Ganesh In Mangalagiri : మంగళగిరిలో రూ. 2.20 కోట్లతో గణనాథుడిని అలంకరణ
🎬 Watch Now: Feature Video
Currency Ganesh In Mangalagiri : దేశంలో గణేశ్ నవరాత్రుల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఎవరికి తోచినట్టు వారు ఆ లంబోదరుడిని కొలుచుకుంటున్నారు. కొందరు పూలు, పండ్లతో ప్రత్యేకంగా మండపాలను అలంకరిస్తుంటే.. మరికొందరు కూరగాయలతో గణపతి ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్లో కొలువైన గణనాథుడిని సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్వాహకులు అలంకరించారు. మెయిన్ బజార్లో దశావతారంలో కొలువైన గణనాథుడు ని వ్యాపారులు రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో ముస్తాబు చేశారు. 18 ఏళ్ల క్రితం ఐదు లక్షలతో అలంకరించడం ప్రారంభించిన వ్యాపారులు క్రమంగా పెంచుకుంటూ వచ్చారు. ఈ ఏడాది రెండు కోట్ల 20 లక్షలతో అలంకరించామని మండపం నిర్వహకులు సంకా బాలాజీ గుప్తా చెప్పారు. వినాయకుడిని అలంకరించేందుకు సుమారు రెండు నెలల నుంచి తమ కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించారన్నారు. రెండు కోట్ల 22 లక్షలతో కొలువైన గణనాథుడిని శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు ఇతర రాజకీయ పార్టీ నేతలు, ప్రజలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.