టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడి అక్రమ అరెస్టు - ఆర్యవైశ్య శ్రేణుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 6:04 PM IST
Criticism of Arya Vaishya Leaders on Jagan : తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆర్యవైశ్య శ్రేణులు ఆందోళన చేపట్టారు. రాకేష్ అరెస్టుకు వ్యతిరేకంగా విజయవాడ గుణదల పోలీస్ స్టేషన్ ఎదురుగా వాణిజ్య విభాగానికి చెందిన ఆర్యవైశ్య శ్రేణులు నిరసనకు దిగారు. వైకాపా ప్రభుత్వంలో ఆర్యవైశ్య సామాజిక వర్గ సంక్షేమం కోసం చేసిన పనులు, అదేవిధంగా టీడీపీ హయాంలో ఆర్యవైశ్యులకు అందిన సంక్షేమంపై రాకేష్ ప్రశ్నించారు. అంతేగాక దీనిపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుతో బహిరంగ చర్చకు సిద్ధామని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే డూండి రాకేష్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి గుణదల పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆ సంఘం నాయకులు తెలిపారు.
రాకేష్ విసిరిన సవాల్‌ను వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వీకరిచలేక భయపడి అతన్ని అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.30 కోట్లు నిధులు ఇచ్చిందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. వెల్లంపల్లి చేసిన అవినీతి, అక్రమాల కారణంగా జగన్ అతని మంత్రి పదవిని తొలగించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యవులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన రాకేష్‌ను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.