మొదటి మ్యాచ్లోనే విరిగిన బ్యాట్లు - ఇక 47 రోజులు ఆడేదెట్లా జగనన్నా? - Adudam Andhra Program in YSR district
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 6:03 PM IST
Cricket Bats Broken in Adudam Andhra Program: 'ఆడుదాం ఆంధ్రా' ఆటల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే మొదటి మ్యాచ్లోనే రెండు బ్యాట్లు విరిగిపోయాయి. ఈ పరిస్థితి వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నెలకొంది. దీంతో కార్యక్రమానికి కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం కొనుగోలు చేసిన క్రీడా సామగ్రిపై క్రీడాకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి రోజే బ్యాట్లు విరిగాయంటే ఎంత నాసిరకమైన క్రీడా సామగ్రిని ప్రభుత్వం కొనుగోలు చేసిందో అర్థమవుతోందని అంటున్నారు. 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమం ప్రారంభోత్సవం రోజే బ్యాట్లు విరిగిపోతే ఇక 47 రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో ఎలా ఆడాలని క్రీడాకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక కమలాపురం నియోజకవర్గంతో పాటు మరి కొన్నిచోట్ల క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్లు నామమాత్రంగా సిద్ధం చేశారు. వీటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ ఎం.వీ హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.