CPI State Secretary Ramakrishna Made Allegations Against YCP: నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్టం అప్పులపాలైంది: రామకృష్ణ - టీడీపీ నేతలపై వైసీపీ నేతలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 10:05 PM IST
CPI State Secretary Ramakrishna Made Allegations Against YCP: నాలుగేళ్ల వైసీపీ పాలనలో సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా తాగు, సాగు నీటితో పాటు ప్రాజెక్టులను పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.
మద్యం, ఇసుక ద్వారా వచ్చే ప్రతి పైసా తాడేపల్లిలో జగన్ ఇంటికే చేరుతుందని రామకృష్ణ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేటివరకూ.. వైసీపీ ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్ల అప్పులు చేసిందని రామకృష్ణ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటుకు రూ. 2వేల చొప్పున నగదు ఇచ్చి గెలిచేందుకు సైతం వెనుకాడదని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిగే యుద్ధం అని జగన్ అంటున్న మాటలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. రాష్ట్రంలో సీఎం జగన్ కంటే ధనవంతుడు ఎవరైనా ఉన్నాడా అంటూ రామకృష్ణ ప్రశ్నించారు.