కరవుపై అందరూ స్పందించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు : కె. రామకృష్ణ - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 5:43 PM IST

CPI State Secretary Ramakrishna Criticism of Jagan : కరవుపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్యలు కూడా చేపట్టడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో మొత్తం 470 మండలాల్లో కరవు నెలకొందని వాటిపై ఆయా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. తక్షణమే ప్రభుత్వం కరవు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలను వైసీపీ రాజకీయ వేదికలుగా మార్చి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న కరవుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 30 గంటల నిరసన దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపి.. కరవు నివారించాలని డిమాండ్ చేశాయని తెలిపారు. కరవుపై అందరూ స్పందించినా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పాలాభిషేకాలు చేసేవాళ్లకే విశ్వవిద్యాలయాల్లో వీసీలుగా పదవులు ఇచ్చిందని అన్నారు. ఎస్కే(SK) యూనివర్సిటీలో వీసీ.. వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పోకడలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.