తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్​ను తీసుకువచ్చింది: రామకృష్ణ

🎬 Watch Now: Feature Video

thumbnail

CPI Ramakrishna on Krishna water Gazette Notification: ఏపీకి అన్యాయం చేస్తూ కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్​ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు. కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్​ను నిరసిస్తూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై విజయవాడ దాసరి భవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రానికి చేతగాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. 

"ఏపీకి అన్యాయం చేస్తూ కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్​ను తీసుకువచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలకు బీజేపీ తెరలేపింది. రాష్ట్రానికి చేతగాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది." - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  

Last Updated : Nov 1, 2023, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.