Continuous Flood Flow Increase to Srisailam Reservoir: ఎగువ నుంచి వరద.. శ్రీశైలం రిజర్వాయర్లో 119 టీఎంసీల జలాలు
🎬 Watch Now: Feature Video
Continuous Flood Flow Increase to Srisailam Reservoir : ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయ నీటిమట్టం రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. గత శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయ నీటిమట్టం 860.20 అడుగులకు చేరింది. నీటి నిల్వ 106.4176 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం నీటి నిల్వ 119.7828 టీఎంసీలుగా నమోదయింది.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 46,364 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 864.30 అడుగులుగా నమోదయింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 119.7828 టీఎంసీలుగా నమోదయింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద తక్కువగా ఉండడంతో శ్రీశైలానికి స్వల్పంగా వరద ప్రవాహం వస్తోంది. కర్ణాటకలో వర్షాలు కురిస్తే తప్ప, శ్రీశైలానికి ఆశించిన స్థాయిలో వరద వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత ఏడాది ఇదే సీజన్లో శ్రీశైలం జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకొని, గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది వరద ప్రవాహం కోసం రాయలసీమ రైతులు ఎదురుచూస్తున్నారు.