Congress Leader Tulasi Reddy on YSRCP Bus Yatra: "ఒక్క రూపాయీ విడుదల చేయకుండా.. ఇలా యాత్రలు కూడా చేస్తారా"
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 4:46 PM IST
Congress Leader Tulasi Reddy on YSRCP Bus Yatra: వైసీసీ నేతలు చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వారు చేపట్టిన ఈ యాత్ర హస్యాస్పదంగా ఉందని తులసి రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్లకు నిధులు విడుదల చేయకుండా.. కార్పొరేషన్లను వైసీపీ ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని మండిపడ్డారు.
బలహీన వర్గాల వారిపై ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోపిందని అన్నారు. అమ్మ ఒడి ద్వారా వచ్చిన నగదు.. సాయంత్రం వేళ నాన్న బుడ్డికి సరిపోవడం లేదన్నారు. సామాజిక సాధికారత గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కే ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు నిజంగా సామాజిక సాధికారిత పట్ల చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్ష పదవుల్లో.. ఒక్క పదవినైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన సవాల్ విసిరారు. దళితుడైన సంజీవయ్యను 63 సంవత్సరాల క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ చేసిందని గుర్తు చేశారు.