Chinta Mohan on Srikalahasti Temple: 'శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అవినీతి జరుగుతోంది'
🎬 Watch Now: Feature Video
Chinta Mohan Fire on YSRCP: తిరుపతి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భారీగా అవినీతి జరుగుతోందని మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రోజుకు 10 లక్షల రూపాయల వంతున వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ము ఎక్కడికి తరలిపోతుందని.. ఎవరెవరికి ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆలయంలో ప్రతి దాంట్లో కూడా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అవినీతితో డబ్బులు సంపాదించడానికే వైసీపీ అధికారంలోకి వచ్చిందా అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి తెచ్చిన మన్నవరం బెల్ పరిశ్రమల పనులను బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఆపిందని అన్నారు. దీనిపై శ్రీకాళహస్తిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి మన్నవరం పరిశ్రమ పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. అనంతరం సత్యవేడులో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ సిటీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని తెలిపారు.