CM Jagan Review Meeting: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.. పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం! ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పిలుపు.. - జగనన్న ఆరోగ్య సురక్ష
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 10:01 PM IST
CM Jagan Review Meeting: గడప గడపకు కార్యక్రమానికి అదనంగా మరో రెండు కార్యక్రమాలకు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆ వివరాలను ప్రభుత్వ విప్ ప్రసాదరాజు తెలిపారు. ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలనే కార్యక్రమాన్ని పార్టీపరంగా చేపట్టాలని సూచించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో భేటీ అయిన సీఎం... ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించాలని ఆదేశించినట్లు ప్రసాదరాజు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలంతా గేర్ మార్చాలని, సీఎం జగన్ (CM Jagan) చెప్పినట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఐదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. ప్రజల్లో విస్తృతంగా తిరగాలని ఆదేశించారని ఆయన తెలిపారు. వైనాట్ 175 (why Not 175) నినాదం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడతామని మంత్రి జోగి రమేష్ తెలిపారు.