CM Jagan Meet Union Minister Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ.. పోలవరం నిధుల విడుదలపై చర్చ! - Cm jagan news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 10:36 PM IST
|Updated : Oct 6, 2023, 10:42 PM IST
CM Jagan Meet Union Minister Amit Shah: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విడుదల, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిల అంశాలపై చర్చించారు. భేటీకి ముందు దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోం శాఖ నిర్వహించిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశానికి జగన్ హాజరయ్యారు. అనంతరం అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్.. శనివారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు.
Jagan Met Union Minister Nirmala Sitharaman: సీఎం జగన్ ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి దిల్లీకి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా (గురు, శుక్ర) ఆయన దిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో, మరికొంతమంది కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రెండవ రోజు ఉదయం 9.45 గంటలకు 1 జన్‌పథ్ నివాసం నుంచి బయలుదేరినా సీఎం.. విజ్ఞాన్ భవన్‌కు చేరుకొని వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.