కడప పెద్ద దర్గాను సందర్శించిన సీఎం జగన్‌ - ప్రత్యేక ప్రార్థనలు - Kadapa District News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 10:44 PM IST

CM Jagan Kadapa Tour : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి కడప పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు నుంచి ప్రత్యేక విమానంలో మెుదటగా కడప జిల్లాకు చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా పెద్ద దర్గా చేరుకున్న ముఖ్యమంత్రికి పీఠాధిపతులు ఘన స్వాగతం పలికారు. అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన సీఎం.. పూల చాదర్ కూడా సమర్పించారు.  అక్కడే పలువురు స్థానికులను పలకరించి వారి నుంచి అర్జీలు స్వీకరించారు. తర్వాత తిరిగి కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. 

అయితే సీఎం రాక సందర్భంగా కడప నగరంలో ఉదయం నుంచి పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతకుముందు.. వైఎస్ జగన్ నంద్యాల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.