సీఎం జగన్ ప్రారంభించి వెళ్లక ముందే ఇలా పెచ్చులూడిపోయాయి- నాసిరకం పనులపై ఆగ్రహావేశాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 8:20 PM IST
CM Jagan Inaugurates to Unfinished Work: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైయస్సార్ జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప నగరంలో పనులు పూర్తికాని నిర్మాణాలకు సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవాలు చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. సీఎం జిల్లాకు విచ్చేస్తుడడంతో శనివారం మధ్యాహ్నం వరకు కొనసాగిన నిర్మాణాలకు జగన్ ప్రారంభోత్సవం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Kadapa City Residents Fire on Officials: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన శనివారం కడప నగరంలో ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్‌ను ఆయన ప్రారంభించారు. అయితే, అసంపూర్తిగా జరిగిన పనులకు, నాణ్యతలేని నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్ చేత అధికారులు హడావుడిగా ప్రారంభోత్సవాలు చేయించారని స్థానికులు విమర్శిస్తున్నారు. నగరానికి సీఎం విచ్చేస్తుడడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు పనులు కొనసాగాయని గుర్తు చేశారు. అంబేద్కర్ కూడలికి ఎదురుగా వేసిన కొత్త డివైడర్ గ్రానైట్ పలకలు ఊడి కిందపడ్డాయని మండిపడ్డారు. ఓవైపు సీఎం పనులు ప్రారంభిస్తుంటే, మరోవైపు డివైడర్‌కి వేసిన పలకలన్నీ కింద పడిపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.