CM Jagan Go Back 'సీఎం గో బ్యాక్'.. అభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేశాక నియోజకవర్గానికి రావాలి: పోతిన మహేష్ - CM Jagan news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 4:35 PM IST
Janasena Party Protest Against CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా నియోజకవర్గం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ.. జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శ్వేతపత్రం విడుదల చేసిన తరువాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడ వన్‌టౌన్‌లో 'సీఎం గో బ్యాక్' అంటూ ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
Pothina Mahesh Comments: జనసేన నాయకుడు పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. ''వాహనమిత్ర పథకం నిధుల విడుదలకు పశ్చిమ నియోజకవర్గానికి వస్తున్న సీఎం జగన్.. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆటో డ్రైవర్ల వెతల గురించి ఓసారి ఆలోచించాలి. ఆటోలకు వేసిన ఈ చలాన్‌లను రద్దు చేసి, చిత్తశుద్ధిని నిరుపించుకోవాలి. ఆటో డ్రైవర్లకు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. వాళ్లకి గృహసముదాయలు నిర్మించాలి. జగన్ ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయలు ఆటో డ్రైవర్లుకు కాదు, ఆటో యజమానులకు. రాష్ట్రంలో ఉద్యోగాలు రాక వందలామంది నిరుద్యోగులు ఆటో డ్రైవర్లుగా మారారు. ఈ దుస్థితికి కారణం సీఎం జగనే. ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలి. వెల్లంపల్లి అవినీతిపై సీఎం జగన్ బాధ్యత వహించాలి.'' అని ఆయన డిమాండ్ చేశారు.