Class War in YSRCP ఏలూరు వైఎస్సార్సీపీలో వర్గపోరు.. ఎంపీ అనుచరులను అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు! - Eluru district YSRCP
🎬 Watch Now: Feature Video
Class War in Eluru district YSRCP: ఏలూరు జిల్లాలోని వైసీపీలో మరోసారి వర్గపోరు బయటపడింది. ఇప్పటికే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలీజాకు మధ్య నడుస్తున్న వర్గపోరు తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఎంపీ వర్గీయులకు, ఎమ్మెల్యే వర్గీయులకు మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా చింతలపూడి మండలం సీతానగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎలీజా నిర్వహించగా.. ఎంపీ వర్గీయులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఎంపీ వర్గీయులకు సమాచారం ఇవ్వకుండా ఎలా వచ్చారని స్థానిక ఎంపీ మద్దతుదారులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఫోన్ చేసి సమాచారం అందిచినట్లు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడున్న వారిని.. అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే వర్గీయులు తమపై దాడి చేశారని ఎంపీ వర్గీయులు ఆరోపించారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి వస్తే తమ సమస్యలు విన్నవించుకునే అవకాశం లేకుండాపోయిందని అన్నారు.