Clash Between Two Groups of YCP: వజ్రకరూరు వైసీపీలో ఇరువర్గాల ఘర్షణ.. 25 మందిపై కేసు నమోదు - Anantapur District News
🎬 Watch Now: Feature Video
Clash Between Two Groups of YCP: అనంతపురం జిల్లా వజ్రకరూరు ఎస్సీ కాలనీలో గురువారం రాత్రి వైసీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ్గా.. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి వర్గీయులు ఎస్పీని ఆశ్రయించారు. వజ్రకరూరు మండలంలో గురువారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి వర్గీయులు, ఎమ్మెల్సీ శివరాంరెడ్డి వర్గీయులు ఒకరికొకరు తీవ్రస్థాయిలో దాడులకు దిగారు. ఈ దాడిలో దాదాపు 25 మందిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సర్పంచిగా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి వర్గీయులు, శివరామిరెడ్డి వర్గీయుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ.. అనంతపురం జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీ తమ కేసులో ప్రత్యేక చొరవ తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కోరారు. గతంలోనూ ఇరు వర్గాల దాడిలో కేసును నమోదు చేయడం వల్ల జీర్ణించుకోలేక మరల తమపై కక్షపూరితంగా వేట కొడవళ్లు, రాళ్లు కట్టెలతో దాడి చేశారని సర్పంచి మోనాలిసా చెప్పారు. తమ ఊరికి వెళ్లాలన్నా భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ తమకు న్యాయం చేస్తారని నమ్మకంతో కార్యాలయానికి వచ్చామని ఆమె తెలిపారు. జిల్లా ఎస్పీ తమకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
Police registered a case against 25 people: ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 25 మందిపై పోలీసులు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని సీఐ శేఖర్ వారి బృందం పరిశీలించారు. దాడి జరిగిన ప్రాంతంలో గోడలకు, రోడ్డుపై రక్తపు మరకలను వారు పరిశీలించారు. అక్కడున్న ప్రత్యేక సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 13 మందికి గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అనంతపురం నుండి కర్నూలుకు తరలించారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన చిన్నపాటి గొడవ ఈ ఘర్షణకు దారి తీసిందని సీఐ శేఖర్ తెలిపారు.