CID Investigation Officer Change In Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో దర్యాప్తు అధికారి మార్పు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 10:01 AM IST

Updated : Oct 11, 2023, 2:15 PM IST

CID Investigation Officer Change In Inner Ring Road Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో (IRR Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ దర్యాప్తు అధికారిని మార్చారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం సీఐడీ ఎకనామిక్స్ విభాగంలో ఏఎస్పీగా పని చేస్తున్న జయరాజు అమరావతి రింగ్ రోడ్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఆ బాధ్యతలను విజయ భాస్కర్​కు అప్పగించారు. సీఐడీ ఎకనామిక్ అఫెన్స్ వింగ్​లో బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ విజయ భాస్కర్​ను రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారిగా సీఐడీ నియమించింది. జయరాజుకు ఇతర కేసుల బాధ్యతలు ఉండటంతో అదనపు పని భారం పడుతోందని.. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారిని మారుస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో పేర్కొన్నారు. ఈ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్​ను మంగళవారం సీఐడీ విచారించింది. లోకేశ్‌ ఇవాళ మరోసారి సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. 

Last Updated : Oct 11, 2023, 2:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.