Turmeric root essential oil : సౌందర్య పోషణలో పసుపు ఎంతో చక్కని ఔషధం. పసుపు మొక్క వేర్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్‌లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని సౌందర్య నిపుణులు చెప్తున్నారు. ఆ ఆయిల్‌ను సౌందర్యం కోసం ఎలా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.
సౌందర్య పోషణలో కీలకమైన పసుపు మొక్క వేర్లు సైతం ఎంతో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయట. పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్‌లో యాంటీ ఎలర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ప్యారసైటిక్ గుణాలున్నాయి. చర్మ ఆరోగ్యానికి అవి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!
చర్మం తాజాగా!
కొన్నిసార్లు చర్మం కళ తప్పుతుంది. ఇలాంటప్పుడు ఒకటిన్నర చెంచా ఆలివ్ ఆయిల్‌లో పసుపు వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ ఒక్క చుక్క కలుపుకొని రాసుకోవాలి. రోజూ రాత్రి పడుకొనే ముందు ముఖంపై రాసుకుని మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల నిర్జీవమైన చర్మ కణాలు తిరిగి తాజాదనం సంతరించుకుంటాయి.
మొటిమలు, మచ్చలు మాయం!
పసుపు వేర్ల ఎసెన్షియల్ ఆయిల్‌లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. ఇదే విషయాన్ని (National Libraray Of Medicine) తన పరిశోధనల్లో ప్రచురించింది. వీటితోపాటు పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తాయి.
మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!
వృద్ధాప్య ఛాయలకు చెక్!
ఎసెన్షియల్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. అందుకుగాను నాలుగు చెంచాల బాదం నూనెలో నాలుగు చుక్కల పసుపు ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ముఖంపై సన్నని గీతలు, ముడతలున్నచోట ఈ మిశ్రమంతో మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఎక్కువైన నూనెని తొలగించుకోవాలి. రాత్రి పడుకొనే ముందు ఈ చిట్కాను కూడా రోజూ పాటిస్తే ఫలితం ఉంటుంది.
ఈ జాగ్రత్తలు..
పసుపు నూనెను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నూనెను నేరుగా చర్మం లేదా కురులపై రాసుకోకూడదని, కొబ్బరి, బాదం, జొజోబా నూనెలతో కలిపి మాత్రమే వినియోగించాలని చెప్తున్నారు. వీలైనంత తక్కువ మోతాదులోనే పసుపు నూనె ఉపయోగించాలి.
నూనెను ఉపయోగించడం వల్ల చర్మం చాలా సున్నితంగా తయారవుతుంది కాబట్టి ఎండలోకి వెళ్లే వారు ముఖాన్ని స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవాలి.
ప్యాచ్ టెస్ట్ ఇలా!
నూనె వినియోగానికి ముందుగా సౌందర్య నిపుణుల సలహా తీసుకోవడం, ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇది అన్ని చర్మతత్వాల వారికి సరిపడకపోవచ్చని, ప్యాచ్ టెస్ట్ కోసం ముందుగా ఈ నూనెను వేరే నూనెతో కలిపి వాడాలని సూచిస్తున్నారు. మిశ్రమాన్ని చర్మంపై రాసుకున్న 20 నిమిషాల వరకూ ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోతే వాడుకోవచ్చని, లేదంటే దీన్ని వాడకపోవడమే మంచిదంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీరు ఏ స్టైల్లో వండుతున్నారు - తేడా వస్తే అనారోగ్యం పొంచి ఉందట!
మాంసాహారం మంచిదా? చెడ్డదా? - వారంలో ఎన్నిసార్లు నాన్ వెజ్ తినొచ్చో తెలుసా?