CM Jagan meeting with the IPAC team: 'ఏయే ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గింది..?' ఐప్యాక్ బృందంతో సీఎం భేటీ

By

Published : Jul 7, 2023, 8:08 PM IST

thumbnail

CM meeting with the IPAC team: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహాలను అందిస్తోన్న ఐప్యాక్ టీమ్​తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో వైసీపీ ముఖ్య నేతలు, ఐప్యాక్ టీం ఇన్​చార్జి రిషి రాజ్ సహా సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తాజా పరిస్థితిపై సీఎం విశ్లేషించారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోన్న తీరుపై సీఎం సమీక్షించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల భాగస్వామ్యం, పనితీరుపై చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఐ ప్యాక్ టీం నివేదికలు ఇవ్వగా.. వాటిపై సీఎం జగన్ చర్చించినట్లు తెలిసింది. నియోజక వర్గాల్లో గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు, స్థానిక పరిస్థితులపై సీఎం చర్చించారు. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో నియోజక వర్గ ఇన్​చార్జీల మార్పు, నియామకాలపై చర్చించినట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.