Ajay is chief advisor to CM : 'వివేకా నో మోర్' అని అప్పుడే తెలిసింది..: సీఎం ముఖ్య సలహాదారు అజయ్ - సీబీఐ స్టేట్ మెంట్
🎬 Watch Now: Feature Video
Ajay is chief advisor to CM : వివేకా హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసి వివరాలు తీసుకున్నారని సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం తెలిపారు. చిట్ చాట్ అని చెప్పి సీబీఐ తన నుంచి కొన్ని వివరాలు తీసుకోవటం వాస్తవమని అన్నారు. తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపొందించిన 161 స్టేట్ మెంట్ కు ఎలాంటి విలువ లేదని పేర్కొన్నారు. సాక్ష్యాధారంగా 161 స్టేట్ మెంట్ కు విలువ ఉండదని తెలిపారు. కేవలం సమాచారంగా మాత్రమే ఆ వివరాలు సీబీఐ సేకరించిందని స్పష్టం చేశారు. మేనిఫెస్టో సమావేశంలో ఉండగా వివేకా నోమోర్ అనే విషయం మాత్రమే తనకు తెలిసిందని అజయ్ కల్లాం తెలిపారు. ఎలా చనిపోయారన్న వివరాలను తానేమీ సీబీఐకి చెప్పలేదని అన్నారు. తాను ఆ వివరాలు ఏమీ చెప్పకపోయినా సీబీఐ చేసేది ఏమీ లేదని అన్నారు. ఈ తరహా వార్తలు ప్రచురించటం, ప్రసారం చేయడం వల్ల తనకు పోయేది ఏమీ లేదని, సీబీఐ లీక్ లు ఇవ్వటం సరికాదని అజయ్ కల్లాం వ్యాఖ్యానించారు.