Chandrababu Sand Sculpture on the Sea Shore: కొత్త వాడరేవు సముద్ర తీరంలో చంద్రబాబు సైకత శిల్పం.. టీడీపీ నేతలపై కేసు నమోదు - చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 11:38 AM IST
Chandrababu Sand Sculpture on the Sea Shore : మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ బాపట్ల జిల్లా కొత్త వాడరేవు సముద్ర తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించి ఆ పార్టీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో అంధకారం నెలకొని ప్రజలు కన్నీరు పెడుతున్నట్లు అంతర్జాతీయ సైకత శిల్పి బాలాజీ వర ప్రసాద్ శిల్పాన్ని తీర్చిదిద్దారు. అక్రమ కేసుల నుంచి త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని టీడీపీ నేతలు చింతకాయల విజయ్, వేగేశన నరేంద్ర వర్మ అన్నారు.
పలువురి టీడీపీ నేతలపై కేసు నమోదు : కొత్త ఓడరేవు తీరంలో చంద్రబాబు నాయుడు సైకత శిల్పం ఏర్పాటుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చింతకాయల విజయ్, వేగేశ్న నరేంద్ర వర్మ సహా 28 మంది నేతలపై కేసు నమోదు చేశారు. 144 సెక్షన్ ఉండగా నిరనస తెలిపారని బాపట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్ర తీరంలో 144 సెక్షన్ ఏంటని ప్రశ్నించారు.
TAGGED:
సముద్ర తీరంలో 144 సెక్షన్