పూచీకత్తులు సమర్పించేందుకు రేపు సిట్ కార్యాలయానికి చంద్రబాబు - andhra pradesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 7:34 PM IST
Chandrababu Going to SIT Office Tomorrow: తెలుగుదేశం అధినేత చంద్రబాబు శనివారం ఉదయం సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. వీటికి సంబంధించిన పూచీకత్తు, షూరిటీలను చంద్రబాబు సీఐడీ అధికారులకు ఇవ్వనున్నారు. ఇటీవలే అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన మూడు కేసుల్లోనూ ఒకేసారి ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఉచిత ఇసుక, మద్యం కేసుల్లో బెయిలు ఇచ్చింది. అదే విధంగా ఇద్దరి పూచీకత్తుతో రూ.లక్ష విలువ గల బాండ్ సమర్పించాలని పేర్కొంది.
వారం రోజుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి ముందు పిటిషనర్ లొంగిపోయి, ఇద్దరి పూచీకత్తుతో రూ.లక్ష విలువ గల బాండ్ సమర్పించాలని పేర్కొంది. అనంతరం పిటిషనర్‌ను విడుదల చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అవసరమైనప్పుడు దర్యాప్తు నిమిత్తం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని సూచించింది. హాజరు అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడుకు 48 గంటల ముందుగా నోటీస్ ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో పూచికత్తును, షూరిటీలను ఇచ్చేందుకు చంద్రబాబు శనివారం సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు.