'ఉచిత ఇసుక' కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ - విచారణ ఈనెల 22కు వాయిదా - వెంకటరెడ్డి సీఐడీకి ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 3:33 PM IST
Chandrababu Bail Petition Hearing Adjourned: టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సీఐడీ నమోదు చేసిన ఉచిత ఇసుక పథకంలో.. ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానంలో.. అక్రమాలు చోటు చేసుకున్నాయని గనుల శాఖ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ వెంకటరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ చంద్రబాబును ఏ2గా చేర్చుతూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారనే ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఉచిత ఇసుక విధానంలో వ్యాపార నియమాలు పాటించలేదని ఆరోపిస్తూ.. ఇసుక తవ్వకాలపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి నియంత్రణలు విధించలేదని ఎఫ్ఐఆర్లో పేర్కోంది.