రుషికొండను పరిశీలించిన కేంద్ర కమిటీ - విధ్వంసం, నిర్మాణాలపై ఆరా - Central Committee news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 3:46 PM IST
Central Committee Examined Rushikonda Constructions: రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ (ఎంవోఈఎఫ్) నియమించిన నిపుణుల కమిటీ పరిశీలించింది. పరిశీలనలో భాగంగా కొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనల వంటి అంశాలపై ఆరా తీసింది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్నాహ్నం 2.30 గంటల వరకు రుషికొండపైనే ఉన్న కేంద్ర కమిటీ, కొండను తొలిచిన విధానం, తవ్విన చోట ఏ విధంగా ఉంది? అనే అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించింది.
Central Expert Committee Visited Visakha: రుషికొండపై జరుగుతున్న అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను తేల్చేందుకు నియమించిన కేంద్ర నిపుణుల కమిటీ గురువారం విశాఖను సందర్శించింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రెండు వాహనాల్లో రుషికొండ వద్దకు చేరుకుంది. బృంద సభ్యులకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండను ఆనుకొని ఉన్న క్యాంపు కార్యాలయానికి బృంద సభ్యులు వెళ్లారు. అక్కడ కొద్ది నిమిషాలపాటు అధికారులతో మాట్లాడి, 3 గంటల తర్వాత తీరం వెంట మట్టిని డంప్ చేసిన ప్రాంతాలను పరిశీలించారు. అయితే, కేంద్ర బృందం వెంట ఏపీటీడీసీ, జీవీఎంసీ అధికారులు మాత్రమే ఉండడంతో, మిగిలిన వారిని రుషికొండ సమీపానికి రానివ్వలేదు.