క్రిస్మస్, న్యూయర్​ సందడి షురూ, విశాఖలోని డాల్ఫిన్ హోటల్​లో కేక్ మిక్సింగ్ - Cake mixing program

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 10:30 PM IST

Cake Mixing Program at Dolphin Hotel Visakhapatnam: రానున్న క్రిస్మస్, న్యూయర్​ సందర్భంగా కేక్ మిక్సింగ్ కార్యక్రమం విశాఖలోని డాల్ఫిన్ హోటల్​లో సందడిగా జరిగింది. ప్రతి ఏటా దాదాపు నెలన్నర ముందుగానే ఈ తరహా కేక్ మిక్సింగ్ చేయడం డాల్ఫిన్ హోటల్లో ఆనవాయితీగా వస్తోంది. అతిథులకు సరిపడా కేక్​లను సిద్ధం చేయడానికి దీనిని నాందిగా భావిస్తారు. ఎండు ద్రాక్ష, ఇతర డ్రై ఫ్రూట్స్, ఆల్కహాల్ వంటివి ఇందులో కలిపి ఈ కేక్​ను సిద్ధం చేయనున్నారు. ప్రధాన చెఫ్ సహా, ఇతర చెఫ్​లు, సిబ్బంది ఉత్సాహంగా ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మిక్సింగ్​ని 45 రోజుల పాటు ఒక కంటైనర్​లో ఉంచి.. అనంతరం దీనితో కేక్​ను తయారు చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా అతిథులకు ఈ మిక్సింగ్​తో తయారు చేసిన కేక్​లను అందిస్తామని హోటల్ జనరల్ మేనేజర్ రామకృష్ణ వెల్లడించారు. ప్రతి ఏటా ఈ రకంగా ఆరు వారాల ముందు నుంచి కేక్​ను సిద్దం చేసే ప్రక్రియను ఆరంభించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని అన్నారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.