Puri making tricks and tips : మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లోకి ఎప్పుడూ ఇడ్లీ, దోసె వేస్తే పిల్లలే కాదు కుటుంబంలో పెద్దవాళ్లు కూడా అంతగా ఇష్టపడరు. అందుకే అప్పుడప్పుడు పూరీలు చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. నూనె బాగా పీల్చుకుంటాయని, సరిగా పొంగడం లేదన్న బాధ ఇక అవసరం లేదు. పూరీలు నూనె పీల్చకుండా, పొంగాలంటే ఓ సింపుల్ చిట్కా ఉంది.
గంటల కొద్ది మెత్తగా ఉండే "సొరకాయ చపాతీ" - మీ పిల్లలు ఒక్కటి కూడా మిగల్చరు!
పూరీలు అంటే ఎంతో ఇష్టం ఉన్నా చాలా మంది నూనె కారణంగా వాటికి దూరంగా ఉంటారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో కాల్చిన నూనె మళ్లీ మళ్లీ వాడుతారనే భయంతో పూరీ ఆర్డర్ చేయడానికే ఇష్ట పడరు. పొంగిన పూరీలు భోజన ప్రియల మనసు దోచుకుంటాయి. నూనె భయం ఉన్నా నోరూరిస్తుంటాయి. ఆదివారం, లేదా సెలవు రోజుల్లో పూరీలు చేయించుకుని మటన్, చికెన్ షోర్వాలో తింటుంటే ఎంత బావుంటుందో! అయితే పూరీలు నూనె పీల్చకుండా ఓ చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. పూరీలు నూనె పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం!
కావాల్సిన పదార్థాలు
- గోధుమ పిండి - 2 కప్పులు
- ఉప్మా రవ్వ - 3 స్పూన్లు
- పంచదార - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - కొద్దిగా
పిండిలో కొద్దిగా ఉప్మా రవ్వ కలపడం వల్ల పూరీలు చక్కగా పొంగుతాయి. నూనె ఎక్కువగా పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి. అంతే కాదు పొంగిన పూరీలు ఎక్కువ సేపు అలాగే ఉండిపోతాయి.
తయారీ విధానం
ముందుగా ఓ పెద్ద గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండి, 3 స్పూన్లు ఉప్మా రవ్వ, 1 టీ స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు, నూనె వేసుకుని కలుపుకోవాలి. (ఇవే కొలతలతో అదనంగా వాడుకోవచ్చు) పిండి మిశ్రమంలోకి గోరు వెచ్చని నీళ్లు పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు ఒకే సారి ఎక్కువగా పోసుకోకుండా కొంచెం కొంచెం కలుపుకుంటే పిండి సరిగ్గా ఉంటుంది. ఇలా సిద్ధం చేసుకున్న పూరీ పిండిని అరగంట పాటు నానబెట్టుకోవాలి.
రవ్వ వేయడం వల్ల పిండి నానిన తర్వాత గట్టి పడుతుంది. అందుకే అరగంట తర్వాత మరో రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి. తిరిగి పూరీలకు అవసరమైన సైజులో బాల్స్ చేసుకుని పక్కన పెట్టాలి. వాటిని పొడి పిండి చల్లుకుటూ వత్తుకోవాలి. పూరీలు పలుచగా వత్తుకుంటే పొంగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే పూరీ పొంగాలంటే మరీ ఎక్కువ కాకుండా కాస్త మందంగా వత్తుకోవాలి. అప్పుడే అవి పొంగడంతో పాటు క్రిస్పీగా ఉంటాయి.
పూరీలు కాల్చే సమయంలో
కడాయిలో పూరీలు మునిగిపోయేలా నూనె పోసుకోవాలి. మంట హై ఫ్లేమ్‌లో ఉండాలి. మంట తక్కువగా ఉంటే పూరీలు నూనె ఎక్కువ పీల్చుకుని పొంగవు. అందుకే పూరీలు కాల్చే టైంలో మంట హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలని గుర్తుపెట్టుకోండి.
వత్తుకున్న పూరీలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. పూరీ వేయగానే నూనెలో పైకి తేలకుండా రాకుండా జల్లెడతో సున్నితంగా వత్తాలి. అంతే! పొంగిన పూరీలను రెండో వైపు కూడా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది.
డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నారా? - మీకు ఈ విషయాలు తెలుసా? - నిపుణులు ఏమంటున్నారంటే!
ఎప్పుడూ ఇడ్లీ, దోసెలేనా? - రాగిపిండితో ఇలా చేయండి - ఫ్యామిలీ అంతా మీకు ఫ్యాన్స్ అవుతారు!