Byreddy Rajasekhar Reddy Fire on cm Jagan: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై జగన్ కక్ష సాధింపులు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి - ap news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2023, 10:51 PM IST

Updated : Aug 25, 2023, 11:05 PM IST

Byreddy Rajasekhar Reddy Fire on cm Jagan : రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారందరిపైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపులకు దిగుతున్నారని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మహానందికి చెందిన ఇద్దరు విలేకరులపై వైసీపీ నాయకులు పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా నంద్యాలలో  ఏపీయూడబ్ల్యూజే (APUWJ Protest)ఆధ్వర్యంలో నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. దీనికి హాజరైన బైరెడ్డి జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జర్నలిజంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన రామోజీరావు సంస్థలపైనే జగన్ దాడులు (CM Jagan Attack on Ramoji Rao Group) చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆయన వయసు, అనుభవానికి గౌరవం ఇవ్వకుండా మార్గదర్శిపై కక్ష సాధింపులకు దిగారని ఆక్షేపించారు. ఈనాడు పత్రికలో వ్యతిరేక వార్తలు రాస్తున్నందునే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు. ఏపీని రౌడీ ప్రదేశ్‌గా మార్చేలా సీఎం జగన్ వైఖరి ఉందని ఆయన అన్నారు. అవినీతి, అక్రమాలు చేసే వారికి జగన్ అవార్డులు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. 

Last Updated : Aug 25, 2023, 11:05 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.