Bus Rammed Into The Field: పొలంలోకి దూసుకెళ్లిన బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం - కొమరోలు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Bus Rammed Into The Field In Komarolu: ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణ సమీపంలోని కడప - అమరావతి రాష్ట్రీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్లోని భూపాల్ జిల్లా నుంచి తిరుమలకు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు.. మంగళవారం రాత్రి కొమరోలు సమీపంలో ఎదురుగా మరో వాహనం వచ్చింది. ఆ వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారాన్ని అందుకున్న కొమరోలు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో బస్సును పొలంలో నుంచి బయటకు తీశారు. ఆనంతరం ప్రయాణికుల వివరాలు సేకరించిన పోలీసులు.. వారిని తిరుమలకు పంపించారు. ఈ ఘటనపై సకాలంలో స్పందించిన పోలీసులకు ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు.