టీడీపీ హయాంలోని పథకాలను వైసీపీ నిలిపివేసింది: భవన నిర్మాణ కార్మికులు - Building Employs Protest

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 3:57 PM IST

Building Construction Employees Protest In Vizag: విశాఖపట్నం జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎం​సీ (Greater Vishakhapatnam Municipal Corporation) గాంధీ పార్క్​ వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ హయాంలో కార్మికులకు సంక్షేమ పథకాలు అన్నీ అమలయ్యేవని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయంగా నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

YSRCP Government Stopped Schemes Implemented During TDP: ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గతంలో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలయ్యేవని, వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి పెండింగ్​లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గాంధీ పార్క్​లో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.