గతంలో స్కిల్ సెంటర్లలో తూతూమంత్రంగా ట్రైనింగ్ ఇచ్చారు: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
Buggana Rajendranath Reddy comments on Skill Development case: స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు హెచ్చరిస్తే.. ఏపీ సర్కారు మౌనంగా ఉండాలా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో స్కిల్ సెంటర్ల లో తూతూమంత్రంగా ట్రైనింగ్ ఇచ్చారన్నారు. స్కిల్ ట్రైనింగ్ సెంటర్లలో పరికరాలకు అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు.. వాస్తవ ధరకు సంబంధం లేదని బుగ్గన ఆరోపించారు. స్కిల్ స్కాములో ఏమీ నిరూపించలేదని టీడీపీ నేతలు ఎలా చెబుతారంటూ నిలదీశారు. స్కాంలో ఎం జరిగిందనేది కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తున్నామని వెల్లడించారు. గచ్చిబౌలిలో, అమెరికాలోని డల్లాస్లో ఆందోళన చేసే ఐటీ ఉద్యోగులు, తెలుగు వారు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలని తెలిపారు. సిల్క్ డెవలప్మెంట్లో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం 2017 నుంచే విచారణ ప్రారంభించిందని మంత్రి తెలిపారు. గతంలో వారం రోజులపాటు కూడా ట్రైనింగ్ ఇవ్వలేదన్న మంత్రి.. తమ ప్రభుత్వం ఇప్పుడు సరాసరి మూడు నెలలపాటు శిక్షణ ఇస్తుందని తెలిపారు.