బస్సు ఢీకొని బైకర్ మృతి.. బైక్​ను 12 కి.మీ లాక్కెళ్లిన డ్రైవర్.. ఆఖరికి.. - Bike stuck in bus in up dragged at 90 speed

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 21, 2023, 8:55 AM IST

యూపీలో ఓ విషాద ఘటన జరిగింది. బైక్​ను​ ఢీ కొట్టింది ఓ బస్సు. దీంతో బైక్​పై ఉన్న వ్యక్తి​ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్​ మాత్రం బస్సు బానెట్​లో ఇరుక్కుపోయింది. అయినా దాన్ని పట్టించుకుని బస్సు డ్రైవర్​.. అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దాదాపు 12 కిలో మీటర్ల పాటు బైక్​ను బస్సుతో లాక్కెళ్లాడు. ఎటా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 19 అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎటా నుంచి దిల్లీకి వెళ్తున్న ఫజల్‌గంజ్ డిపోకు చెందిన బస్సు.. ఆవుల కొట్టం ప్రాంతంలో వికాస్ (25) అనే బైకర్​ను ఢీ కొట్టింది. ఘటనలో వికాస్​ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్​.. బస్సు బానెట్​లో ఇరుక్కుపోయింది. అదేమి పట్టించుకొని బస్సు డ్రైవర్​.. వాహనాన్ని అలాగే ముందుకు పోనిచ్చాడు. ఇది గమనించిన తోటి వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. బస్సును ఆపి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు మొబైల్​లో రికార్డ్​ చేసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. ఘటనకు కారణమైన బస్సు డ్రైవర్ అజయ్ కుమార్‌ను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. వికాస్​ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.