Bhuvaneshwari Emotional Tweet on Chandrababu Bail: '53 రోజులు ఎంతో వేదన చెందా.. క్షణమొక యుగంలా గడిచింది..' - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 7:32 PM IST

Bhuvaneshwari Emotional Tweet on Chandrababu Bail : స్కిల్‌ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం జైలు నుంచి చంద్రబాబు విడుదలైన సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి భావోద్వేగపూరితమైన ట్వీట్‌ చేశారు. చంద్రబాబు జైలులో ఉన్న 53 రోజుల పాటు ఎంతో వేదన పడ్డానని  తెలిపారు. ఆ సమయంలో తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచిందని ఆవేదన వెలిబుచ్చారు. కష్టకాలంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఇచ్చిన మద్దతు ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.

Bhuvaneshwari Said Thanks to Supporters : మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారని గుర్తు చేసుకున్నారు. కక్ష సాధింపులపై చేసిన పోరాటం, రోడ్డెక్కి చేసిన నిరసనలు, మహిళలు చూపిన తెగువ మరింత స్ఫూర్తినిచ్చాయని భువనేశ్వరి తెలిపారు. 'నిజం గెలవాలి' అనే పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి సోదరుడు, ప్రతి మహిళ, ప్రతి పౌరుడికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని భువనేశ్వరి ట్వీట్ చేశారు. 53 రోజులుగా తనను ఇంటి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని భువనేశ్వరి కృతజ్ఞత వ్యక్తం చేశారు. దేవుడి దయతో ప్రజలు, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్​ ద్వారా భువనేశ్వరి తెలిపారు.   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.