తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీలకు సరైన న్యాయం జరిగింది: బీటీ నాయుడు - BT Naidu criticizes social awareness bus trip
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 4:46 PM IST
BC Leaders Round Table Meeting Under TDP in Kurnool : బీసీలకు తెలుగు దేశం పార్టీలోనే సరైన న్యాయం జరిగిందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీటీ నాయుడు అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం బీసీ నాయకులతో.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరవుతారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు రాజకీయ పదవులకు దూరం అయ్యారని వివరించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడచినా.. బీసీ కులగణన ఎందుకు చెయ్యలేదని బీటీ నాయుడు ప్రశ్నించారు. బీసీలకు ఏం న్యాయం చేశారని ముఖ్యమంత్రి జగన్ సామాజిక చైతన్య బస్సు యాత్ర నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్న వారిలో దాదాపు 90 శాతం మంది ఓకే వర్గానికి చెందినవారే ఉన్నారని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తెలిపారు.