paruchuri drama festivals: 'పరుచూరి' నాటకోత్సవాలు ప్రారంభం.. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే.. - 31st Drama Festival updates

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 28, 2023, 10:55 PM IST

Paruchuri Raghubabu Memorial Trust 31st Drama Festival updates: ప్రముఖ సినీ రచయితలు, టాలీవుడ్ నటులు..  పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తులో ఈ ఏడాది నాటకోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ప్రజలు, నాటక ప్రియులు తిలకించి విజయవంతం చేయాలని పరుచూరి వేంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. 

పరుచూరి 31వ నాటకోత్సవాలు ప్రారంభం.. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామంలో ప్రతి సంవత్సరం పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ ఏడాదికి సంబంధించిన 31వ నాటకోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఎక్కడా ప్రదర్శించని ఆరు నాటకాలను పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తులో ప్రదర్శించడం ఈ సారి ఉత్సవాల్లో ప్రత్యేకత అని పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. 

ఎక్కడా ప్రదర్శించని ఆరు నాటకాలు వేస్తున్నాం.. ఈటీవీ భారత్‌తో ఆయన మాట్లాడుతూ.. ఈనాడు సంస్థ ఛైర్మన్ రామోజీ రావుగారికి పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తుకు విడదీయలేని సంబంధం ఉందని పేర్కొన్నారు. తమ పరిషత్తులో నాటకోత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి ఆయన (రామోజీ రావు) అన్ని విధాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ 31వ నాటకోత్సవాలు ఈరోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నందమూరి తారకరామారావు కళా ప్రాంగణంలో జరగనున్నాయని.. ఈసారి ఎక్కడా ప్రదర్శించని ఆరు నాటకాలను పల్లెకొనలో వేయనున్నామని వెల్లడించారు. కాబట్టి ప్రజలు, నాటక ప్రియులు ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

''నా కుమారుడు రఘుబాబు జ్ఞాపకార్థంగా 1989లో ఈ నాటక పరిషత్తును ఏర్పాటు చేశాం. ప్రతి ఏడాది ఈ పరిషత్తులో నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఎక్కడా ప్రదర్శించని ఆరు నాటకాలను పల్లెకోనలో వేస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ శతజయంతి. ఆ మహానుభావుడి జయంతి రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నాటక రంగాన్ని నమ్ముకున్న కళాకారులను ప్రజలు ప్రోత్సహించాలి. నాటక రంగం ఎక్కడా తగ్గలేదు.. ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంది. నాలుగు రోజులు నాటకరంగ ప్రదర్శనలతో అభిమానులను అలరించనున్నాం. ఈ సాంస్కృతిక సంబరాలను తిలకించేందుకు కళాకారులు, నాటకరంగ అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయండి.'' -పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రముఖ సినీ రచయిత

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.