Bandaru Satyanarayana Comments: ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించడం, విమర్శించడం.. రాజకీయ నాయకుల హక్కు: బండారు - Bandaru Satyanarayana news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 7:27 PM IST
|Updated : Oct 9, 2023, 8:05 PM IST
Bandaru Satyanarayana Comments on Police Notices: ''ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించడం, విమర్శించడం.. రాజకీయ నాయకుల హక్కు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆందోళన చెంది, వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన మాట వాస్తవమే. దీనిపై కేసులు నమోదు చేయడం అన్యాయం. 43 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో విమర్శలు, ప్రతివిమర్శలు చూశాను. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే మాట్లాడాను.'' అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ అన్నారు.
Bandaru Comments: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవలే బండారు సత్యనారాయణపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి.. 41 ఏ నోటీసులు ఇవ్వడంతో బండారు సత్యనారాయణ సోమవారం గుంటూరు ఆరండల్ పేట పోలీస్ స్టేషన్‌కి విచ్చేశారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన బండారు.. 41 ఏ ప్రకారం తాను విచారణకు హాజరయ్యానని అన్నారు. విచారణలో అరండల్‌పేట ఎస్‌ఐ కొన్ని ప్రశ్నలు వేశారని, వాటికి తాను సావధానంగా సమాధానాలు చెప్పానన్నారు. పత్రికా ముఖంగా కొన్ని విమర్శలు చేశారని అడుగగా.. రాజకీయంగా ప్రభుత్వ విధానాలపై విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని, వారు ముందు మాట్లాడటం వల్లే తాను సమాధానం ఇవ్వాల్సి వచ్చినట్లు పోలీసులకు తెలిపానని బండారు వివరించారు.