మంత్రి విడదల రజిని ఆఫీస్‌పై దాడి ఘటన- దారిన పోయేవారిని అరెస్టు చేస్తున్నట్లు విమర్శలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 3:16 PM IST
Attack on Minister Vidadala Rajini Party Office: గుంటూరులోని మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు రోడ్డున పోయే వారిని సైతం అరెస్టు చేయటం విమర్శలకు తావిస్తోంది. మొత్తం 50 మందిని పట్టాభిపురం పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అరెస్టైన వారిలో పల్నాడు జిల్లా వేలూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు కూడా ఉన్నారు. పేరేచర్లకు చెందిన పాములపాటి రాంబాబు తన కుటుంబంతో కలిసి చర్చ్‌కి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా కార్యాలయం వద్ద జరుగుతున్న గొడవను చూసి వాహనాన్ని పక్కకు నిలిపారు. పచ్చ చొక్కా వేసుకున్నాడన్న కారణంతో ఆయనను కూడా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఏ ఆధారాలతో తన భర్తను నిర్భందించారంటూ రాంబాబు భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మా కుటుంబంతో కలిసి మేము చర్చ్‌కి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా మంత్రి విడదల రజిని కార్యాలయం వద్ద గొడవను చూసి వాహనాన్ని పక్కకు నిలిపాం. అయితే పచ్చ చొక్కా వేసుకున్నాడన్న కారణంతో మా ఆయనను కూడా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఏ ఆధారాలతో పోలీసులు నా భర్తను నిర్భందించారో పోలీసులు తెలిపాలి. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాం." - రాజ్యలక్ష్మి, రాంబాబు భార్య