శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి కలకలం - పట్టుకోవాలని ఫారెస్ట్​ అధికారులకు అచ్చెన్న లేఖ - srikakulam lo tiger

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 9:15 PM IST

Atchannaidu Letter to Visakhapatnam Forest Officer about Tiger: శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గంలో పెద్దపులి సంచారం కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విశాఖపట్టణం (chief conservator of forests)అటవీ సంరక్షణ అధికారికి లేఖ రాశారు. ప్రజలకు, పశువులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని.. అలాగే పెద్దపులిని పట్టుకోవాలని కోరారు. ఈ సందర్బంగా స్థానిక అటవీశాఖ అధికారులుతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండల పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు మీడియాకు చెప్పడంతో తమకు తెలిసిందన్నారు. 

సంబంధిత అటవీ శాఖ అధికారుల సమన్వయంతో ప్రస్తుతానికి ప్రజలకు ఏ హానీ జరగకుండా ఆయన చూస్తామన్నారు. కానీ పశువులకు, ప్రతీ రోజు ఇతర పనులకు వెళ్లే ప్రజలకు పెద్దపులి సంచారం కారణంగా నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా పెద్దపులిని పట్టుకోవాలని అటవీ శాఖ సిబ్బందిని అచ్చెన్నాయుడు కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.