తక్కువ డబ్బులు ఇవ్వడంతోనే కక్ష కట్టి దాడి - దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు దాడి ఘటనపై ఏసీపీ రవికాంత్ - విజయవాడలోని నార్త్ జోన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 12:00 PM IST
Assault While Intoxicated : డబ్బులు తక్కువ ఇచ్చారనే కారణంతోనే దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై కృష్ణ అనే వ్యక్తి దాడి చేశారని.. విజయవాడ నార్త్ జోన్ ఏసీపీ రవికాంత్ తెలిపారు. ఇటీవల కర్నాటి రాంబాబు తండ్రి మృతి చెందారని తెలిపారు. దీంతో రాంబాబు తన తండ్రి సమాధి వద్ద రోజూ సాయంత్రం దీపం పెట్టేందుకు రోజూ వెళ్తుతూ ఉండేవాడని పేర్కొన్నారు. తన తండ్రి సమాధిని శుభ్రం చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి రాంబాబు.. 200 రూపాయలిచ్చారని తెలిపారు. అదే సమయంలో.. కాటికాపరిగా పనిచేస్తున్నా కృష్ణ అనే వ్యక్తి.. తనకూ కూడా ఇవ్వాలని అడిగాడని తెలియజేశారు. కృష్ణకు తక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల రాంబాబుపై కక్ష పెంచుకున్నారని తెలిపారు. రోజు లాగానే తండ్రి సమాధి వద్ద దీపం పెట్టేందుకు వచ్చిన రాంబాబుపై బీరు సీసాతో దాడి చేశాడని పేర్కొన్నారు. రాంబాబుపై దాడి చేసే సమయంలో కృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేదని వివరించారు.