"ఆర్యవైశ్యులకు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రాధాన్యతనివ్వాలి"

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 5:09 PM IST

Arya Vaishya political  JAC : రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆర్యవైశ్య రాజకీయ ఐకాస డిమాండ్ చేసింది. శాసనసభ ఎన్నికల్లో 10 సీట్లు, లోక్​సభకు 2 సీట్లను ఆర్యవైశ్యులకు కేటాయించాలని కోరింది. ఈ మేరకు త్వరలో అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలను కలవనున్నట్లు వెల్లడించింది. విజయవాడలోని ఓ హోటల్లో ఆర్యవైశ్య రాజకీయ ఐక్య కార్యాచరణ ఏర్పాటును పురస్కరించుకుని సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో  కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, కో-కన్వీనర్ హరిప్రసాద్ పాల్గొన్నారు. 

1960లో రాష్ట్రంలో సుమారు 30మంది ఆర్యవైశ్య ఎమ్మెల్యేలు ఉండేవారని వారు అన్నారు. ప్రస్తుతం ఆర్యవైశ్యుల సంఖ్య నామమాత్రంగా మారిందని అంబికా కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. 40 లక్షల మంది ఆర్యవైశ్య ఓటర్లున్నారని వివరించారు. 8 శాతం ఓటింగ్ ఉందన్న అంబికా కృష్ణ, ప్రభుత్వానికి 31 శాతం పన్నులు కడుతున్నట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్యవైశ్యుల ప్రాధాన్యాన్ని గుర్తించి, రాజకీయ పార్టీలు టిక్కెట్లు కేటాయించాలని, రానున్న ఎన్నికల్లో పోటీకి ఆశావహులైన ఆర్యవైశ్యుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని అంబికా కృష్ణ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.