AP RTC Bus Fire Accident in Chennai : ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు! - rtc bus fire accident in chennai
🎬 Watch Now: Feature Video
AP RTC Bus Fire Accident in Chennai : ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో చెన్నైలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికుల్ని దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి 9.30 గంటలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు రెడ్ హిల్స్ వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. మొదట ఇంజన్ నుంచి పొగలు వచ్చి.. మంటలు వ్యాపించడంతో వెంటనే డ్రైవర్ బస్సును ఆపివేసి అందరిని దింపేశాడు. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేసుకుంటూ రోడ్డుపై పరుగులు తీశారు. డ్త్రెవర్ అప్రమత్తంగా వ్యవహరించటం వల్ల పెను ప్రమాదం తప్పి.. ఎవరికి ఎటువంటి నష్టం కలగలేదు. ఘటన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసారు. కాని అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కొంత సేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.