APPTD, NMUA Leaders Letter to CS, RTC MD: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని సీఎస్‌, ఆర్టీసీ ఎండీలకు ఉద్యోగ సంఘాలు లేఖ - Trade Unions in AP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2023, 9:49 AM IST

APPTD, NMUA Leaders Letter to CS, RTC MD for Outsourcing Employees: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా విభాగంలో పనిచేస్తున్న 8 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తేవాలని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం డిమాండ్ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చే స్కేళ్ల ప్రకారమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ వేతనాలు చెల్లించాలని ఆ సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు చేర్చిన ప్రభుత్వం పీటీడీ విభాగంగా మారిన ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మాత్రం విస్మరించిందని ఆక్షేపించారు. ఏపీపీటీడీ (APPTD), ఎన్ఎంయూఎ (NMUA) నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీలకు లేఖలు రాశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించేలా కాంట్రాక్టర్లకు ఇచ్చే స్కేళ్ల ప్రకారమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సామాజిక, ఆర్ధిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విస్మరించిందని నేతలు ఆక్షేపించారు. తక్షణం వారిని ఆప్కాస్ కింద చేర్చటమో లేదా ప్రభుత్వమో ఆర్టీసీ యాజమాన్యమో నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.