APNGO Leaders Met CS: సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. సీఎస్ ఉద్యోగసంఘాల వినతి - Teachers Problems to CS
🎬 Watch Now: Feature Video
APNGO, APTF Leaders Meets Chief Secretary: ఏపీఎన్జీవో, ఏపీటీఎఫ్ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఎస్‌ను కోరినట్లు వారు తెలిపారు. సీఎస్‌తో తమ సమస్యలు విన్నవించకున్న ఇరు సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై సీఎస్‌తో చర్చించినట్లు వారు వెల్లడించారు. దీనిపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల పెన్షనర్ల 25 డిమాండ్లను సీఎస్‌కు వివరించినట్లు వారు తెలిపారు. అరియర్లను నగదు రూపంలో పెన్షనర్లకు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్ ఉద్యోగులుగా మార్చాలని కోరామని.. మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగులను, లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని వివరించామన్నారు. పే అండ్ అకౌంట్స్ ఆఫీసులో అర్హత కలిగిన అధికారులకు పదోన్నతి కల్పించాలని కోరినట్లు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను నియామాకాల్లో నిబంధనలను సడలించాలని కోరినట్లు వివరించారు.