'హామీలు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తాం - ప్రభుత్వానికి మహిళా ఉద్యోగుల హెచ్చరిక'

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 7:33 PM IST

APJAC Amaravati Women's Preparing for Strike: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆయా శాఖల్లో మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నూతనంగా ఏర్పాటైన ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం నేతలు డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను జనవరి మొదటి వారంలోగా అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.  

APJAC Amaravati Women's Section State President Comments: కర్నూలులో ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో మహిళా విభాగం నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ మాట్లాడుతూ ''మహిళ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నూతనంగా మహిళా విభాగం ఏర్పాటైంది. ఇకపై ఈ నూతన కమిటీ ద్వారా మహిళల ఉద్యోగులు ఎదుర్కొంటున్నా కష్టాలను ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఉద్యోగుల సరెండర్ లీవులు, 2 డీఏలు, బకాయి బిల్లులను సెప్టెంబర్ కల్లా చెల్లిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇంతవరకు చెల్లించలేదు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు జనవరి మొదటి వారంలోగా బకాయి బిల్లులు చెల్లిస్తే సరే, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడతాం.'' అని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు మురళీకృష్ణ నాయుడు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.