APGEA President: సూర్యనారాయణకు ఇబ్బందేమి లేదు: విజయవాడ ఫ్యామిలీ కోర్టు - ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-07-2023/640-480-18937115-879-18937115-1688713564120.jpg)
APGEA President Suryanarayana Anticipatory Bail: ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ పరిష్కారమయ్యే వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పిటిషనర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని విజయవాడలోని ఫ్యామిలీ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇంఛార్జీ కోర్టుగా తాము పనిభారంతో ఉన్నామని.. ఈ పరిస్థితుల్లో బెయిల్ పిటిషన్ విచారణ సాధ్యపడడం లేదని పేర్కొంది. రెగ్యూలర్ కోర్డు జడ్జి సెలవుల్లో ఉన్నారని.. ఎంఎస్‌జే న్యాయస్థానం జడ్జి కూడా ఓడిలో ఉండటంతో.. ఈ పిటిషన్ ఫ్యామిలి కోర్టుకు వచ్చిందని న్యాయమూర్తి టి. వెంకటేశ్వర్లు గుర్తు చేశారు.
కేఆర్ సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విజయవాడ ఫ్యామిలీ కోర్టులో విచారణకు రాగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది సోము కృష్ణమూర్తి వాదనలు వినిపించారు. ఈనెల 7వ తేదీలోగా ముందస్తు బెయిల్ పిటిషన్‌న పరిష్కరించమని హైకోర్టు పేర్కొందని ఆయన గుర్తు చేశారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. బెయిల్ పిటిషన్ పరిష్కారం అయ్యే వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో పిటిషనర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. రెగ్యూలర్ న్యాయాధికారి ముందు.. ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేలా విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు.