ఓటర్ల జాబితా సవరణ దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్‌ కేసులు : ఈఆర్వో

🎬 Watch Now: Feature Video

thumbnail

AP Voter List 2023 Amendment Process in Parchuru : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రంలోనే బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు ఈఆర్వో పి.వెంకట నారాయణ తెలిపారు. ఓటర్ల సవరణకు సంబంధించి ఎవరైనా దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. ఫారం-7లు పెట్టినంత మాత్రాన కేసులు పెట్టడం సాధ్యం కాదని తెలిపారు దీని వల్ల బీఎల్వో నుంచి ఈఆర్వో వరకు రేయింబవళ్లు పని చేయాల్సి వస్తోందని, ప్రతి అంశం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు.  

Parchur Voter List Revision Process in Bapatla District : పర్చూరు రెవెన్యూ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలతో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. సవరణ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు 41,038 దరఖాస్తులు రాగా వీటిలో ఓట్ల తొలగింపునకు ఇచ్చే ఫారం-7లు 22,702 ఉన్నాయి. ఫాం-6 అర్జీలు 10,939, ఫాం- 8లు 7397 దాఖలు అయ్యాయి. ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత ఫాం-7లు 8,335, పారం-6లు 2,297, ఫాం-8లు 892 వచ్చాయనిని ఈఆర్వో పి.వెంకట నారాయణ వెల్లడించారు. 

ఈ సమావేశంలో పర్చూరు, యద్దనపూడి తహసీల్దార్లు సంధ్యశ్రీ, రవికుమార్‌, కారంచేడు, ఇంకొల్లు ఉప తహసీల్దార్లు సుశీల, స్వర్ణగీత, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.