సీఈవోను కలిసిన టుమారో అధ్యక్షుడు - సచివాలయ మహిళా పోలీస్‌లు బీఎల్వోగా వ్యవహరించడంపై అసంతృప్తి - nallamotu chakravarthi meets ceo mukesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 1:32 PM IST
AP Tomorrow Organisation President met CEO: రాష్ట్రంలో అక్రమంగా జరుగుతున్న ఓట్ల తొలగింపు సహా వివిధ అంశాలను వివరించేందుకు ఏపీ టుమారో సంస్థ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి సీఈవో(CEO) ముఖేష్‌కుమార్ మీనాను సోమవారం కలిశారు. ఫాం-7ను దుర్వినియోగం చేస్తూ కొందరు కావాలనే ఓట్లు తొలగిస్తున్నారని ముఖేష్‌కుమార్‌కు చక్రవర్తి వివరించారు. కొన్ని సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కోరమని తెలిపారు. కొన్ని అంశాలపై CEO సానుకూలంగా స్పందించారని నల్లమోతు చక్రవర్తి చెప్పారు. మరికొన్నింటిపై సానుకూల స్పందన రాలేదని వీటిపై అవసరమైతే న్యాయస్థానాల్లో పోరాడతామని తెలిపారు.
Complained Illegal Removal of Votes, Sachivalayam women Polices as BLO: ఓటును తొలగించాలని వినతి ఇచ్చిన వ్యక్తి వివరాలు పేరు తప్ప మిగిలిన సమాచారం ఏమీ లేకపోవడంతో ఆ సమాచారం ఇవ్వాలని సీఈవోను అడిగానని చక్రవర్తి తెిలిపారు. అదనపు సమాచారమైన ఎపిక్ ఐడీ, మొబైల్ నెంబర్, ఐపీ అడ్రెస్,రిక్వెస్ట్ చేసిన తేదీ, టైం ఇవ్వలాని కోరమన్నారు. మొబైల్ నెంబర్ ఇవ్వటం ప్రైవసీ కిందకు వస్తుందని, ఇవ్వటం కుదరదని సీఈవో తెలిపారన్నారు. ఎపిక్ నెంబర్ పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. సచివాలయ సిబ్బందిలో ఉన్న మహిళా పోలీస్‌లు బూత్ లెవెల్ ఆఫీసర్‌గా ఉన్నారని, వాళ్లు నిష్పక్షపాతంగా ఉంటారని మాకు నమ్మకం లేదన్నారు. మహిళా పోలీసులు సాధారణ పోలీస్ విధులు నిర్వహించరని డీజీపీ తెలిపారని సీఈవో మీనా తెలిపారని చక్రవర్తి అన్నారు. ఈ విషయంలో సీఈవో మీనా ఏకీభవించలేదని, దీనిపై కోర్టుకు వెళ్తామని చక్రవర్తి స్పష్టం చేశారు. తమ ఓట్లు తొలగిస్తున్నారని బాధితులు పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయట్లేదని తెలిపామని, దీనిపై సీఈవో సానుకూలంగా స్పందించారని తెలిపారు.