VRO ASSOCIATION రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన భూపతి రాజు రవీంద్ర రాజు - ap vros news
🎬 Watch Now: Feature Video
VRO ASSOCIATION PRESIDENT ELECTIONS : రాష్ట్రంలో ఉన్న వీఆర్వోల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు డిమాండ్ చేశారు. సంఘం కార్యవర్గం ఎన్నికల్లో రెండో సారి అధ్యక్షుడిగా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో భూపతి రాజు రవీంద్ర రాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపి.. ఆనందం వ్యక్తం చేశారు. భూపతి రాజు రవీంద్ర రాజు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం తాను శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. మొదటి సారి అధ్యక్షుడిగా పని చేసిన కాలంలో వీఆర్వోల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. గ్రేడ్ 2 వీఆర్వోలకు పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన సంఘానికే ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరారు.
" రాష్ట్రంలో ఉన్న వీఆర్వోల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన సంఘానికే ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి. " - భూపతి రాజు రవీంద్ర రాజు, ఏపీ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు